ETV Bharat / crime

తానేమైనా.. శత్రువు కుటుంబం మిగలకూడదనే కసి - ఏపీ తాజా వార్తలు

తానేమైపోయినా పర్వాలేదు కానీ.. తన శత్రువు, వారి కుటుంబంలో ఒక్కరూ మిగలకూడదనే విపరీత   ధోరణి.. వారిని అంతమొందించేందుకు ఎంతకైనా తెగించాలనే తీవ్ర మనస్తత్వం.. వీటికి తోడు మొదటి నుంచి ఉండే విపరీత ప్రవర్తన వెరసి సామూహిక హత్యలకు కారణమవుతున్నాయి. ఈ తరహా నేరాల్లోని నిందితులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నా.. బయటకు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూసి ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు.

crime issues
crime issues
author img

By

Published : Apr 16, 2021, 7:30 AM IST

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి గురువారం ఉదయం హతమార్చిన ఘటన నేపథ్యంలో ఈ తరహా సామూహిక హత్యలు, వాటికి పాల్పడే నిందితుల తీరు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో ఇలాంటి పలు ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వాటిని విశ్లేషిస్తే సామూహిక హత్యల నిందితుల తీరు అర్థమవుతుంది.

భార్య హత్య కేసులో వ్యతిరేక సాక్ష్యం చెప్పారని..

నేరం: శ్రీకాకుళం జిల్లా మెట్టుపేటకు చెందిన మెట్ట శంకరరావు అనే మాజీ సైనికోద్యోగి 2010 నవంబరులో ఆ గ్రామానికి చెందిన ఏడుగుర్ని అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తాను జైలుకు వెళ్తే తన ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసేవారు ఉండరని.. వారినీ హతమార్చాడు. తన భార్య హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కక్ష పెంచుకుని.. సాక్ష్యం చెప్పిన అందరినీ కొన్ని గంటల వ్యవధిలో వెతికి వెతికి మరీ చంపాడు.

ఫలితం: ఈ కేసులో శంకరరావుకు 2012లో ఉరిశిక్ష పడింది. దానిపై అతను హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు. అతనికి మానసిక చికిత్స అందించాలని అప్పట్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలై.. సెక్యూరిటీ గార్డుగా జీవనం సాగించాడు. చివరికి 2017 మే నెలలో దారుణ హత్యకు గురయ్యాడు.

ఒక హత్య.. బయటపడుతుందని మరో తొమ్మిది

నేరం: తెలంగాణలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ అనే వ్యక్తి హత్యచేశాడు. ఆహారంలో నిద్రమాత్రలు కలిపి వారంతా మత్తులోకి జారుకున్నాక వారిని గోనెసంచుల్లో కుక్కి.. ఓ పాడుబడిన బావిలో పడేశాడు. తాను సహజీవనం చేస్తున్న మహిళ... ఆమె కుమార్తె మీద తాను కన్నేయటంపై నిలదీసిందనే కక్ష పెంచుకుని తొలుత ఆమెను హతమార్చిన సంజయ్‌... ఆ విషయంపై ఆమె బంధువులు ప్రశ్నించారనే కసితో వారందర్నీ అంతమొందించాడు.

ఫలితం: 2020 మే నెలలో ఈ సామూహిక హత్యలు చోటుచేసుకోగా.. అదే ఏడాది అక్టోబరులో సంజయ్‌కుమార్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

ద్వేషం, కసి నేరానికి దారితీయకుండా.

ఎవరైనా వ్యక్తి సామూహిక హత్యలకు తెగబడితే ఆ పర్యవసానాలను వారితోపాటు కుటుంబం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ పర్యవసానాలు సామాజికంగా, ఆర్థికంగా.. పలు రకాలుగా ఉంటాయి. అందుకే కుటుంబసభ్యుల్లో ఎవరైనా విపరీత ప్రవర్తనతో ఉన్నారని గమనిస్తే వారిని దాన్నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి.

* ఏదో ఒక కారణంతో అవతలి వ్యక్తిపై పెంచుకునే ద్వేషం, కసి.. నేరానికి దారితీయొచ్చని మొదట్లోనే గుర్తిస్తే అందుకు అవకాశమివ్వకుండా తగిన చర్యలు చేపట్టాలి. వేరే ప్రాంతానికి తీసుకెళ్లటమో, ప్రత్యర్థులకు దూరంగా ఉంచటమో చేయాలి.

* తమ జీవితాల్లోకి ప్రవేశించి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారనే కారణంతో కొందరు సామూహిక హత్యలకు పాల్పడుతున్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.