తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారంలో నివసించే కానిస్టేబుల్ రమణ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన రమణమూర్తి(38) ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి గన్‌మెన్‌గా విధులు నిర్వహించారు.
కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రమణ మూర్తి తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య తన సోదరుడి ఇంటికి వెళ్లిన తర్వాత మే1న రమణ మూర్తి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
జేఈఈ మెయిన్స్ మే సెషన్ వాయిదా
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం