ETV Bharat / crime

గుత్తేదారుడిని బెదిరించిన కేసులో.. వైకాపా నేత వైఎస్​ కొండారెడ్డి అరెస్ట్ - వైఎస్​ఆర్​ జిల్లా తాజా వార్తలు

Arrest: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, పులివెందుల పరిధిలోని చక్రాయపేట మండల వైకాపా ఇంఛార్జి కొండారెడ్డిని.. కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్​స్ట్రక్షన్ సంస్థ గుత్తేదారుడిని కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది.

Arrest
గుత్తేదారుడిని బెదిరించిన కేసులో.. వైకాపా నేత వైఎస్​ కొండారెడ్డి అరెస్ట్
author img

By

Published : May 9, 2022, 8:58 PM IST

Arrest: ముఖ్యమంత్రి జగన్‌ సమీప బంధువు, పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జ్‌ Y.S. కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రహదారి పనులు చేస్తున్న గుత్తేదారుడిని బెదిరించిన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుత్తేదారుడిని బెదిరించిన కేసులో.. వైకాపా నేత వైఎస్​ కొండారెడ్డి అరెస్ట్

వైఎస్​ఆర్​ జిల్లా చక్రాయపేట మండలంలో ఎస్.ఆర్.కె. కన్‌స్ట్రక్షన్ సంస్థ.. రాయచోటి-పులివెందుల రహదారి పనులు చేస్తోంది. చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జిగా ఉన్న జగన్‌ సమీప బంధువు వై.ఎస్.కొండారెడ్డి.. నిర్మాణ సంస్థ గుత్తేదారును డబ్బులు కావాలని డిమాండు చేసి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. చక్రాయపేట మండలంలో పనులు చేయాలంటే తప్పకుండా తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని గుత్తేదారును బెదిరించినట్లు తేలడంతో కొండారెడ్డిని అరెస్ట్ చేశారు.

ఎస్.ఆర్.కె. కన్‌స్ట్రక్షన్‌... కర్ణాటకకు చెందిన భాజపా కీలక నేతకు చెందింది. కొండారెడ్డి బెదిరింపులపై ఆయన నేరుగా ముఖ్యమంత్రి జగన్‌కే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే పోలీసులు కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఫోన్‌ డేటాను పరిశీలించి గుత్తేదారును బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కొండారెడ్డిని రిమాండ్‌ కోసం కడప జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.