రుయా ఆస్పత్రి ఆవరణలో సూట్ కేసులో కాలిన మృతదేహం కేసుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. భార్యను హతమార్చి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టిన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. ఆ సూట్ కేసును బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. డీబీఆర్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్ నుంచి మృతదేహం ఉన్న సూట్ కేసును బయటకు తీసుకు వచ్చి టాక్సీలోకి ఎక్కించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. హత్య ఉదంతం అనంతరం పరారైన నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలిస్తున్నారు.
ఇదీ చదవండి:
RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణకు యత్నం