ETV Bharat / crime

Hero Siddharth: హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు - hero siddharth latest news

Hero Siddharth: హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. షట్లర్​ సైనా నెహ్వాల్​పై అభ్యంతరకరమైన ట్వీట్​ చేశారని సామాజికవేత్త ప్రేరణ ఫిర్యాదు చేశారు.

Hero Siddharth
Hero Siddharth
author img

By

Published : Jan 12, 2022, 7:55 PM IST

Hero Siddharth: హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు సామాజికవేత్త ప్రేరణ ఫిర్యాదు చేశారు. షట్లర్​ సైనా నెహ్వాల్​పై అభ్యంతరకరమైన ట్వీట్​ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రేరణ ఫిర్యాదు మేరకు పోలీసులు హీరో సిద్ధార్థ్​పై ఐపీసీ 509 సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు.

అసలు ఏం జరిగింది?

ఇటీవల పంజాబ్​లో ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రధాని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన హీరో సిద్ధార్థ్.. అసభ్యకర రీతిలో సైనాపై కామెంట్ చేశారు. అది కాస్త పెద్ద దుమారమైంది.

సిద్ధార్థ్ ట్వీట్​పై సైనా కుటుంబ సభ్యులతో పాటు జాతీయ మహిళా కమిషన్​ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థ్ ట్విట్టర్​ ఖాతాను డిలీట్​ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ పలు వివాదాస్పద ట్వీట్​లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి చెత్త కామెంట్స్ చేసి, సారీ చెబితే సరిపోతుందా అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: హీరో సిద్ధార్థ్ క్షమాపణలు.. స్పందించిన షట్లర్ సైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.