Bullet bandi fame TPO Ashok caught by ACB: మీకు బుల్లెట్టు బండి సాంగ్ గుర్తుందా... అదేనండీ ఓ వధువు కట్టుకున్న భర్తతో జీవితాంతం సంతోషంగా ఉంటాననే ఆనందంతో ఆ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. పెళ్లి బరాత్‌లో వరుడి కోసం డ్యాన్స్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అయితే అది ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా... మళ్లీ ఓసారి ఈ బుల్లెట్టు బండి విషయం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్ల జన్నారానికి చెందిన వధువు సాయి శ్రియను అదే జిల్లాలోని రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. ఇప్పుడు ఆ అశోక్ చేసిన నిర్వాహకం బయటకు వచ్చింది. అశోక్ ప్రభుత్వ అధికారి. ఇంకేముంది తన చేతివాటం చూపించాలని అనుకున్నారు. రూ.30వేలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.
రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో అనిశాకు టీపీవో అశోక్ చిక్కాడు. ఇంటినిర్మాణ అనుమతి కోసం రూ.30వేలు డిమాండ్ చేసిన టీపీవో అశోక్.. అనిశా వలలో పడ్డారు. దీనితో బుల్లెట్ బండి ఫేం అశోక్ మరోసారి వెలుగులోకి వచ్చారు.
-
This bride has truly danced for the groom. She is so happy welcoming him into her life. #truelove Wants to ride on his #Bulletbandi Lovely lyrics and song by @MohanaBhogaraju pic.twitter.com/lV4kdGPplm
— P Narahari IAS (@pnarahari) August 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">This bride has truly danced for the groom. She is so happy welcoming him into her life. #truelove Wants to ride on his #Bulletbandi Lovely lyrics and song by @MohanaBhogaraju pic.twitter.com/lV4kdGPplm
— P Narahari IAS (@pnarahari) August 17, 2021This bride has truly danced for the groom. She is so happy welcoming him into her life. #truelove Wants to ride on his #Bulletbandi Lovely lyrics and song by @MohanaBhogaraju pic.twitter.com/lV4kdGPplm
— P Narahari IAS (@pnarahari) August 17, 2021
ఇవీ చూడండి: