హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. సొంత అన్న ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌసల్య కాలనీలో ఓ కుటుంబం నివాసముంటోంది. వీరికి ఓ కుమారుడు (17), కూతురు(13) ఉన్నారు. గత సంవత్సర కాలం నుంచి అబ్బాయి.. తన చెల్లికి మాయమాటలు చెప్తూ.. ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడుతున్నాడు. సొంత అన్న కావడంతో బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.
ఈ క్రమంలోనే బాలికకు కొద్ది నెలలుగా పీరియడ్స్ రాకపోవడంతో తల్లి అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. 4 నెలల గర్భవతి అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. వెంటనే తేరుకుని.. గర్భం తీసేయాలని వైద్యులను కోరింది. దీంతో వైద్యులు చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ (మేడ్చల్ డీసీపీయూ) అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులు ఈ నెల 17న బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..