Committed Suicide: ‘మీ బంధువుల వివాహాలకు నేను హాజరయ్యాను.. మా బంధువుల ఇంట్లో బోనాలకు నువ్వెందుకు రావడం లేదని’ భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తుక్కుగూడకు చెందిన సాయి కార్తిక్‌గౌడ్(33) తన భార్యతో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడు. పుట్టింటివాళ్లు కావడంతో భార్య అక్కడే ఉండిపోగా కార్తిక్‌గౌడ్ శనివారం ఇంటికి వచ్చాడు. అయితే, ఆదివారం మీర్‌పేటలో జరిగే బోనాల పండగకి తన పిన్ని ఇంటికి వెళదామని భార్యకు పదే పదే సాయి కార్తిక్‌గౌడ్ ఫోన్ చేసినా, భార్య స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సాయి కార్తిక్, రవళికి వీడియో కాల్ చేసి మీ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర విందులకు నేను హాజరవుతున్నా.. తమ వాళ్ల వద్దకు నీవెందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కార్తిక్‌గౌడ్ దూలానికి ఉరేసుకున్నాడు. ఆ సమయంలో ఫోన్ పడేయడంతో దృశ్యాలు కనపడలేదు. దీంతో కంగారు పడిన భార్య, పొరుగున ఉన్న వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. వారు ఇంటికి వెళ్లే సరికి అప్పటికే భర్త మృతి చెందడాన్న సమాచారం అందింది. దీంతో భార్య అక్కడే కుప్పకూలి కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సాయి కార్తిగౌడ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: కర్నూలు జిల్లాలో కన్నతండ్రిని గొంతు కోసి చంపిన కుమారుడు