Road accident in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం పెద్దినాయుడుపేట వద్ద.. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటనలో.. ఇద్దరు మృతి చెందారు. వైద్య దంపతులు.. వారి కుటుంబంతో కలిసి.. విశాఖ నుంచి పలాసకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు రహదారి రక్షణ గోడను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మడే రమేశ్, ఆయన కుమారుడు పదేళ్ల సంకల్ప్.. అక్కడికక్కడే మృతిచెందారు. రమేశ్ భార్య ప్రసన్న లక్ష్మి, కుమార్తె సైర్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ రహదారి సిబ్బంది, పోలీసులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: