ETV Bharat / crime

కీసరలో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి - తెలంగాణ తాజా నేరవార్తలు

3-members-died-in-a-car-accident-at-medchal-district
కీసరలో డివైడర్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
author img

By

Published : Oct 25, 2021, 10:50 AM IST

Updated : Oct 25, 2021, 11:48 AM IST

10:47 October 25

మృతులు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ కుటుంబసభ్యులుగా గుర్తింపు

3-members-died-in-a-car-accident-at-medchal-district
నుజ్జు నుజ్జయిన కారు

మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్​పల్లి వద్ద ఔటర్​ రింగ్ ​రోడ్డుపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు సైబర్ క్రైమ్ ఏసీబీ ప్రసాద్ కుటుంబసభ్యులుగా గుర్తించారు. ప్రమాదంలో ఏసీపీ కేవీఎం ప్రసాద్ సతీమణి శంకరమ్మ, సోదరుడి కుమారుడు భాస్కర్ దంపతులు మృతిచెందినట్లు  పోలీసులు తెలిపారు. ప్రసాద్ సోదరుడు బాలకృష్ణకు తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు.

వీరంతా మేడ్చల్ వాసులుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా చీరాలలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగివస్తుండగా.. ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
  
ఇదీ చదవండి: LEPAKSHI TEMPLE: లేపాక్షి వారసత్వం ‘మురుగు’న పడుతోంది

Last Updated : Oct 25, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.