ETV Bharat / city

మద్యానికి బానిసై కుటుంబసభ్యులకు వేధింపులు.. యువకుని హత్య - family members killed young man in visakhapatnam news

మద్యానికి బానిసై కుటుంబసభ్యులకు వేధింపులు.. యువకుని హత్య

author img

By

Published : Jul 12, 2020, 8:08 AM IST

Updated : Jul 12, 2020, 9:54 AM IST

08:06 July 12

వ్యక్తిని హత్య

విశాఖ జిల్లా అక్కయ్యపాలెం రామచంద్రనగర్​లో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన యువకుణ్ని కుటుంబ సభ్యులే కొట్టి చంపారు. నగరానికి చెందిన అశోక్​ వర్మ అనే యువకుడు మద్యానికి బానిసై.. నిత్యం కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేసేవాడు. శనివారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తల్లి వరలక్ష్మి, అక్క శ్రీదేవి, బావ వెంకటేశ్వరరాజు.. అశోక్​ వర్మపై దాడి చేశారు. తలపై గట్టిగా మోదడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అశోక్​ వర్మను తామే కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

కాపు నేస్తం.. అనర్హుల పరం.. రికవరీకి అధికారుల మీనమేషాలు

Last Updated : Jul 12, 2020, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.