ETV Bharat / city

యోగాతో కరోనాను జయించవచ్చు: యోగా నిపుణులు - vizag news

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే లక్షలాధి మందిని బలితీసుకుంది. కంటికి కనిపించని ఈ ప్రాణాంతక వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళితే... దీనిని ఎదుర్కొవడం కష్టం. అందువల్ల క్లిష్ట మైన అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఈ మహమ్మారితో సమర్థంగా పోరాటం చేయగల శక్తి మన యోగాకు ఉందనేది నిపుణుల మాట. గుండె నిండా ఊపిరి నింపుతూ కొవిడ్​ జయించే సామర్థ్యాన్ని మన యోగ శక్తి కల్పిస్తుందనేది ప్రతి ఒక్కరికీ ఊరట నిచ్చే వాస్తవం.

Yoga To Fight With Covid
యోగాతో కరోనాను జయించవచ్చు
author img

By

Published : Jun 21, 2020, 2:50 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం... గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచానికి ఆరోగ్య కర జీవనశైలికి దారి చూపిస్తోంది. ఈ ఏడాది నెలకొన్న కొవిడ్​ పరిస్థితుల మధ్య యోగా ప్రతిఒక్కరికీ మరింత అవసరం కానుంది. ఇప్పటికే ప్రపంచదేశాలు మహమ్మారిని ఎదుర్కొనే దిశగా తమ ఆరోగ్య స్థితిని మరింత మెరుగు పరిచేందుకు యోగా సాధనాన్ని నమ్ముకుంటున్నాయి. రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తూ శ్వాస కోస సంబంధిత ఆరోగ్యాన్ని పటిష్టం చేసే సత్తా యోగాకు ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • యోగా చేసేవారు ధైర్యంగా ఎదుర్కోవచ్చు..

ప్రాణాంతక వైరస్ శ్వాస గదుల్లోకి ప్రవేశిస్తే విజృంభిస్తోంది. ఆ సమయంలో దాన్ని అదుపు చేయడం వైద్యులకు సైతం ఎంతో కష్టమైన విషయంగా మారుతోంది. కానీ... యోగా సాధన చేసే వారిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వ్యాధిని జయించే శక్తి సామాన్యుల కంటే... వీరిలో ఎక్కువగా ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వం మెరుగవడం ద్వారా ఆందోళన తగ్గుతుందని...కొవిడ్​ను ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి సిద్ధిస్తుందని సూచిస్తున్నారు. ఊష్ట్ర, వృక్ష, సేతు బంధ, భుజంగ, నటరాజ, వీరభద్ర, ధనురాసనాలు సులువుగా చేయడం వీలవుతుందని... ఆన్ లైన్​లో వీటిని చూస్తూ సాధన చేసినా మంచి ఫలితాలు ఉంటాయని యోగా నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు రావడం సాధారణం. మరో వైపు... చాలా మందిలో శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో కొవిడ్ పై మరింత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

ఇంతటి సమస్యాత్మక వైరస్​ను జయించాలంటే... ప్రతి ఒక్కరూ కచ్చితంగా యోగాను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగా సాధన చేయడం ద్వారా పలు సమస్యలను అధిగమించడం సాధ్యపడుతుంది.

ఇవీ చదవండి: సూర్యగ్రహణం: వేదమంత్రాలతో ప్రతిధ్వనించిన తిరుమల క్షేత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.