Vishaka Crime News: విశాఖ నగరానికి చెందిన ఓ మహిళకు గుర్తుతెలియని వ్యక్తి గతేడాది పరిచయమైయ్యాడు. తాను బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాని చెప్పాడు. మాయమాటలతో ఆమెను నమ్మించాడు. ఇరువురి మధ్యం స్నేహం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశ కలిగించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని యువతి ఫొటోలు, బయోడేటా, ధ్రువపత్రాలు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత నగ్న ఫోటోలు పంపమని అడగ్గా.. ఆమె మొదట నిరాకరించింది. తర్వాత అతని మాటలు నమ్మిన ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు పంపి వాట్సప్‌లో చాటింగ్ కొనసాగించింది. గత 15 రోజులుగా నగ్న ఫోటోలు, వీడియోలు మళ్లీ పంపాలని.. లేకపోతే ఫొటోలను బంధువులకు పంపుతానని బెదిరింపులకు దిగాడు.
దీంతో ఆమె విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడీసీపీ డి.సూర్య శ్రావణ్ కుమార్.. అతని బృందం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న తిరుమలశెట్టి కనకరాజు(48)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాని విశాఖ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు తెలియని అపరిచితులకు సోషల్ మీడియాలో షేర్ చేయవొద్దన్నారు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, ఎటీఎం, క్రెడిట్ కార్డు వివరాలు షేర్ చేయడం చెయోద్దన్నారు.
ఇదీ చదవండి: