విశాఖలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య.. భర్తను ఇనుప రాడ్డుతో అతి దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటన ఏవీఎన్ కాలేజీ ద్వారం వీధిలో అర్ధరాత్రి జరిగింది. పూసర్ల పుండరీ కాక్ష, పుణ్యవతి దంపతులు టిఫిన్ సెంటర్ నడిపేవారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి కూడా వీరిద్దరి మధ్య జరిగిన గొడవే హత్యకు దారి తీసినట్లు ప్రాథమిక సమాచారం.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గోరుముద్దలు తినిపించిన చేతులతోనే కన్నబిడ్డలను చంపేసింది..!