CHANGES IN ROAD WIDTH: విశాఖ నగరంలో వెడల్పు తగ్గించాలని అధికారులు నిర్ణయించిన ఓ రోడ్డు.. ఎండాడ నుంచి బీచ్ మార్గాన్ని కలుపుతుంది. రాజీవ్ స్వగృహ పక్క నుంచి వస్తూ..నౌకాదళ ఫైరింగ్ రేంజ్‌ను ఆనుకుని బేపార్క్‌కు సమీపంలో బీచ్ రోడ్డును కలుస్తుంది. ఎక్కువ మొత్తంలో రాజీవ్ స్వగృహకు చెందిన స్థలం నుంచి వెళ్తుంది. దీన్ని 2041 బృహత్తర ప్రణాళికలో.. వీఎంఆర్డీఏ అధికారులు 80 అడుగుల రోడ్డుగా ప్రతిపాదించారు. 40 అడుగులు చాలన్న.. రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ జీఎం వినతికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఎండాడలో రాజీవ్ స్వగృహకు.. 57.53 ఎకరాల భూమి ఉంది. ఇక్కడి స్థలం అమ్మకంతో.. రూ.12 వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఎక్కువ స్థలం రోడ్డుకు కేటాయించడం.. ఫలితంగా ప్లాట్లను కోల్పోవాల్సి రావడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అందుకే కుదించే ప్రణాళిక చేశారని..స్థానికులు అంటున్నారు. రాజీవ్ స్వగృహ స్థలం పోతుందని భావిస్తే.. అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిందని చెబుతున్నారు.
80 అడుగుల నుంచి 40 అడుగులకు తగ్గిస్తున్న మార్గం.. ఎండాడలో ప్రాధాన్యం కలిగిన రోడ్డుల్లో కీలకం. అందువల్ల.. వీఎంఆర్డీఏ ప్రణాళిక విభాగం సైతం 80 అడుగులుగా ప్రతిపాదించింది. ఈ మార్గం బీచ్ రోడ్డు నుంచి..నౌకాదళ ఫైరింగ్ రేంజ్ ప్రహరీ పక్క నుంచి... రాజీవ్ స్వగృహకు కేటాయించిన స్థలాన్ని ఆనుకుని.. ఎండాడ హైవే నుంచి గీతం కళాశాలకు వెళ్లే రోడ్డును కలుస్తుంది. బీచ్ రోడ్డు నుంచి హైవేకు దగ్గరయ్యే ఈ రోడ్డు పొడవునా.. పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, విల్లాలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక అపార్ట్‌మెంట్ల నిర్మాణమూ పూర్తయింది. ఇలాంటి రోడ్డు వెడల్పు తగ్గించడాన్ని.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చదవండి: SUICIDE: విశాఖ పద్మనాభం తోటలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!