విశాఖ ఘటన బాధితురాలికి చికిత్స కొనసాగుతోందని డీసీపీ రస్తోగి చెప్పారు. ఆమె విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోందని వివరించారు. గతంలో నిందితుడు, బాధితురాలి పెళ్లి విషయమై ఇరు కుటుంబాల్లో చర్చలు జరిగాయని... కాని బాధితురాలి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారన్నారు. అప్పటి నుంచి నిందితుడు కోపం పెంచుకున్నాడని.. ఆమెపై అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు గుర్తించామని చెప్పారు.
ఈ ఘటనలో పోలీస్ శాఖ వెంటనే స్పందించి... 307, 452, 354, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని తెలిపారు. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఘటనపై ఆధారాలు సేకరించామని... ఈ కేసుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ నగరంలో అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యాలయాలకు వెళ్లి యువతలో చైతన్యం కల్పిస్తున్నామని వివరించారు. దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలున్నా తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించాలని డీసీపీ సూచించారు.
ఇదీ చదవండి: