ETV Bharat / city

హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్టు

విశాఖ క్రాంతినగర్​లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

vizag police arrested six victims in kranthinagar murder case
హత్య కేసును ఛేదించిన పోలీసులు... ఆరుగురు అరెస్టు
author img

By

Published : Feb 25, 2021, 10:26 PM IST

విశాఖపట్నం క్రాంతినగర్ వద్ద రెండురోజుల క్రితం జరిగిన రౌడీషీటర్ వెంకటేష్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలు, ఆధిపత్య పోరులో భాగంగానే వెంకటేష్ రెడ్డిని కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేసినట్లు ద్వారకా జోన్ ఏసీపీ మూర్తి తెలిపారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

హత్యకు గురైన వెంకటేష్ రెడ్డి, రౌడీ షీటర్ సంతోష్ రాజా గతంలో స్నేహితులు కాగా... వీరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయి రెండు గ్రూపులుగా ఏర్పడ్డారని ఏసీపీ తెలిపారు. తరచూ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని, పథకం ప్రకారం సంతోష్ రాజా రెక్కీ నిర్వహించి వెంకటేష్​ను హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్లు, కత్తులతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మూర్తి తెలిపారు.

ఇదీచదవండి.

పీజీ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్​ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.