ETV Bharat / city

యూనిసెఫ్​నే ఆలోచింపజేసిన విశాఖ బాలుడి ప్రశ్న - విశాఖ తాజా వార్తలు

కొవిడ్ మహమ్మారిపై... విశాఖ బాలుడు వేసిన ప్రశ్న అంతర్జాతీయ వేదికపై ధ్వనించింది. యూనిసెఫ్ వేదికపై 12 ఏళ్ల జై రిషిక్... కొవిడ్ ప్రభావంపై ప్రశ్నను లేవనెత్తాడు. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్న ప్రస్తుత పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన పిల్లల్లో తలెత్తే పౌష్టికాహార సమస్యను రిషిక్ ప్రస్తావించాడు. ప్రపంచవ్యాప్తంగా అయిదుగురు చిన్నారులు ఈ అవకాశాన్ని దక్కించుకోగా అందులో అత్యంత చిన్న వయస్కుడిగా ఆసియా నుంచి రిషిక్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

యూనిసెఫ్​నే ఆలోచింపజేసిన విశాఖ బాలుడి ప్రశ్న

author img

By

Published : May 26, 2020, 1:00 PM IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన కరోనా.. అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఊహకు అందని ప్రతికూల పరిస్థితులను సృష్టించిన ఈ వైరస్ ప్రభావం.. భవిష్యత్తులోనూ ఉండబోతుందనేది సుస్పష్టం. ఈ విపత్తుపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహమ్మారిపై చిన్నారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. కరోనా ప్రభావాన్ని పిల్లలు అర్థం చేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది పిల్లలకు కొవిడ్​పై ప్రశ్నలు సంధించే అవకాశాన్ని కల్పించింది. వీరిలో ఐదుగురు పిల్లల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా సమాధానం ఇచ్చారు. అందులో ఆసియా ఖండం నుంచి ఒకే ఒక ప్రశ్న ఎంపికైంది. విశాఖకు చెందిన జై రిషిక్ అడిగిన ఆ ప్రశ్నకు యూనిసెఫ్ సమాధానమిచ్చింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్న వైనాన్ని జై రిషిక్ గుర్తు చేస్తూ... ఆర్థిక సమస్యల కారణంగా ఆయా కుటుంబాల్లో పిల్లలకు మంచి ఆహారం దొరికే అవకాశం ఉండదనే విషయాన్ని ప్రస్తావించాడు. ఈ సమస్యను అధిగమించి పిల్లలకు పౌష్టికాహారం అందించే దిశగా యూనిసెఫ్ ఏ విధంగా కృషి చేయనుందని జై రిషిక్ ప్రశ్నను లేవనెత్తాడు.

కొవిడ్ కారణంగా అనేక పాఠశాలలు మూత పడి ఉన్నాయని, కోట్లాది మంది పిల్లలు కనీసం మధ్యాహ్న భోజన పథకాలకు సైతం నోచుకోలేని పరిస్థితి ఉందని యూనిసెఫ్ ప్రతినిధి అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యూనిసెఫ్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

కరోనాపై పిల్లల్లో అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని రిషిక్ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పరస్పర సహకారం అందించుకునే మనస్తత్వం, వివిధ వర్గాల్లో నెలకొన్న సమస్యల గురించి తెలియడం ద్వారా భవిష్యత్తులో ఉత్పన్నం అయ్యే సమస్యలను అధిగమించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉంటారని చెబుతున్నారు.

ఈ శతాబ్దపు అతి పెద్ద విపత్తు కరోనాను ఎదుర్కోవడంలో భవిష్యత్తు తరాలకు సైతం స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా యూనిసెఫ్ వంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు చిన్నారుల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.

ఇదీ చదవండి:

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.