ETV Bharat / city

STEEL PLANT: 200వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం.. ప్రత్యేక గీతం విడుదల - విశాఖ తాజా సమచారం

విశాఖ ఉక్కు ఉద్యమం 200 వ రోజుకు చేరిన సందర్భంగా ఏపీ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో "విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు " అంటూ సాగే గీతాన్ని ఆవిష్కరించారు. స్టీల్‌ప్లాంట్ గేట్ వద్ద ఉక్కు నిర్వాసితుల చేస్తున్న దీక్షా శిబిరంలో పాటను ఆలపించారు. పోరాటాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్​ను పోరాటాలతోనే కాపాడుకుంటామని నేతలు హెచ్చరించారు.

Vishakha Steel Movement
విశాఖ ఉక్కు ఉద్యమం
author img

By

Published : Aug 30, 2021, 8:04 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నిర్వాసితులు, కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 200వ రోజుకు చేరిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అంటూ సాగే ఒక పాటను ఆవిష్కరించారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు నిర్వాసితులు చేస్తున్న దీక్షా శిబిరంలో సోమవారం ఈ పాటను ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు బీవీ రమణ చేతుల మీదుగా పాటను విడదల చేశారు.

200వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం... ప్రత్యేక గీతం విడుదల

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నారని బీవీ రమణ మండిపడ్డారు. 6 కోట్ల ఆంధ్రుల ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెడుతూ.. 32 మంది నిర్వాసితుల త్యాగాలతో నిర్మాణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. పోరాటాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్​ను పోరాటాలతోనే కాపాడుకుంటామన్నారు.

ఇదీ చదవండి

Minister Avanthi: 'ఆ విధంగా తీర్మానం చేసి చంద్రబాబుకు పంపించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.