ETV Bharat / city

STEEL PLANT: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు.. పెరుగుతున్న ఆందోళనలు - ఏపీ తాజా వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న వేళ.... ఉద్యమాన్ని ఉరకలెత్తించేలా కార్మికులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ‌్లూ విశాఖలో నిరాహార దీక్షలకే పరిమితమైన ఆందోళనలను... ఇకపై దిల్లీని తాకేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పరిశ్రమను... ప్రాణాలు అర్పించైనా రక్షించుకుంటామని అంటున్నారు.

vishaka steel movement 2.0
vishaka steel movement 2.0
author img

By

Published : Jul 10, 2021, 8:56 AM IST

STEEL PLANT: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు శరవేగంగా కేంద్రం అడుగులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేటీకరణ పూర్తికి ఇద్దరు సలహాదారుల నియామకానికి ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం తీరుపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆందోళనలు దిల్లీకి చేరేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించినప్పుడే... రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కార్మికులు కదం తొక్కారు. విశాఖ కేంద్రంగా ఆందోళనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగానూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, బంద్‌లు జరిగాయి. కొన్ని రోజులుగా స్టీల్‌ప్లాంట్ ప్రవేశద్వారం వద్ద కార్మిక నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి గోడు పట్టించుకోని కేంద్రం.. ప్రైవేటీకరణ పక్రియను వేగవంతం చేయాలని నిశ్చయించింది.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కుకు దిక్కేది..?

దీనికి సంబంధించిన దిల్లీలో భేటీ జరిగిన కొద్దిరోజులకే... కర్మాగారం అమ్మకానికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఇద్దరు సలహాదారుల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా... కేంద్రం ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకపై ఉద్యమం అసలు రూపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: ACHENNAYUDU: 'ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ.. తెలుగు జాతికి ద్రోహమే'

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యత్నాలను కార్మిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండకుండా... తమ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరుతున్నారు. సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఒక్కటిగా నిలిచి, ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు.

కార్మిక సంఘాల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇందులో భాగస్వాములు కావాలని ... CPI జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. పరిశ్రమకు వేలాది ఎకరాల ఇచ్చిన నిర్వాసితుల కుటుంబాల గురించి కేంద్రం ఆలోచించాలన్నారు.

ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోరుతూ విశాఖ గాంధీ బొమ్మ వద్ద అఖిలపక్ష కార్మిక, కర్షక ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన నిరాహార దీక్షలకు 100 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రాణ త్యాగాలతోనైనా ప్లాంటును కాపాడుకుంటామని ఐకాస నేతలు శపథం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.