ETV Bharat / city

సీ హారియర్‌ ప్రదర్శనశాలగా రాజీవ్‌ స్మృతి భవన్‌ - news on rajiv smrithi bhavana at vishaka

విశాఖ బీచ్‌రోడ్డులోని రాజీవ్‌ స్మృతి భవన్‌... త్వరలో సీ హారియర్‌ యుద్ధ విమాన ప్రదర్శనశాలగా మారనుంది. టీయూ - 142, కురుసురా జలంతర్గామితోపాటు ఇటీవల బీచ్‌లో కొలువుదీరిన యుద్ధ విమానం సీ హారియర్‌ను కలిపి ఓ సమీకృత సందర్శనాలయంగా మార్చనున్నారు. డిసెంబర్‌లో జరగబోయే నేవీ డే నాటికి సిద్ధం చేసేలా... విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

vishaka Rajiv Smriti Bhavan to be turned into a seahorse museum

author img

By

Published : Oct 9, 2020, 2:50 PM IST

vishaka Rajiv Smriti Bhavan to be turned into a seahorse museum
సీహారియర్‌ యుద్ధ విమానం

విశాఖపట్నం బీచ్‌ రోడ్డులోని రాజీవ్‌ స్మృతి భవన్‌ త్వరలో సీ హారియర్‌ యుద్ధ విమాన ప్రదర్శనశాలగా మారనుంది. సమీకృత సందర్శనాలయం, పర్యాటక సముదాయం(ఐఎంటీసీ) ప్రాజెక్టులో భాగంగా పనులు వేగవంతానికి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీయూ 142, కురుసురా జలంతర్గామి, తాజాగా సీ హారియర్‌తో కలిపి ఒక సమీకృత సందర్శనాలయంగా తీసుకువచ్చేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ యుద్ధ విమానం బీచ్‌లో కొలువుదీరింది. గత ఏడాది గోవా నౌకాదళ కేంద్రం ఐఎన్‌ఎస్‌ హన్సా నుంచి విశాఖకు తీసుకువచ్చారు. అనంతరం టీయూ 142 పక్కన ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒక వేదిక నిర్మించి కొన్ని మరమ్మతులు, రంగులు వేసి కొత్తగా తయారు చేశారు. ప్రస్తుతం పర్యాటకులకు రోడ్డు పక్కనే కనువిందు చేస్తోంది. దీన్ని డిసెంబరు నాటికి సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఈ సమీకృత ప్రాజెక్టుకు రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు.

సీహారియర్‌ ప్రదర్శనశాలగా మారనున్న రాజీవ్‌ స్మృతి భవన్‌

సీ హారియర్‌ సందర్శనాలయానికి రాజీవ్‌ స్మృతి భవన్‌ వినియోగించనున్న నేపథ్యంలో ప్రస్తుతం జీవీఎంసీ ఆధ్వర్యంలో ఉన్న ఆ కేంద్రాన్ని త్వరలో వీఎంఆర్‌డీఏ స్వాధీనం చేసుకోనుంది. ఇప్పటికే ఆ భవనాన్ని తమకు అప్పగించాలని జీవీఎంసీ కమిషనర్‌కు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ లేఖ రాశారు. దీనికి సంబంధించిన అనుమతులు వచ్చిన వెంటనే పనుల ప్రారంభానికి టెండర్లకు వెళ్లనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు.

సందర్శనాలయానికి వీలుగా ప్రస్తుతమున్న రాజీవ్‌ స్మృతి భవనాన్ని పూర్తిగా తొలగించనున్నారు. పైకప్పుతో పాటు ఇరువైపులా గోడలను కూల్చి సీహారియర్‌ యుద్ధ విమాన ప్రదర్శనకు వీలుగా నిర్మించనున్నారు. గాల్లో ఎగిరే విధంగా యుద్ధ విమానాన్ని వేళాడ దీస్తారు. చుట్టూ విడి భాగాలు, ఇతర పరికరాలను ప్రదర్శనకు ఏర్పాటు చేస్తారు. విమానాన్ని పైనుంచి, కింద నుంచి చూసేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. పనులన్నీ సక్రమంగా సాగితే డిసెంబరు నాలుగు నేవీ డేకు దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి: జగన్ కేసులపై నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.