విశాఖ విమానాశ్రయంలో ప్రధానంగా ప్రయాణికులు వేచి ఉండే స్థలాల వద్ద, బయటకు వచ్చే మార్గాల కారిడార్లలోనూ కళారూపాలు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించడంతోపాటు, పర్యటక సౌరభాన్ని వెదజల్లే విధంగా ఇవి రూపొందించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేకించి రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే విధంగా రూపొందించిన కళాకృతులు ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్: గౌతం సవాంగ్