ETV Bharat / city

అంతర్జాతీయ పోటీలో సత్తా చాటిన విశాఖ

అంతర్జాతీయ వేదికపై విశాఖ నగరం సత్తా చాటింది. అంతర్జాతీయ ఆకర్షణీయ నగరాల సమ్మేళనంలో ఓ కేటగిరీలో తుది జాబితాకు ఎంపికైంది. భారత్ నుంచి ఈ అవార్డు కోసం పోటీ ఇచ్చిన ఏకైక నగరం విశాఖ.

smart city awards
smart city awards
author img

By

Published : Nov 19, 2020, 10:37 AM IST

Updated : Nov 19, 2020, 4:35 PM IST

ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ ఎక్స్​పోలో విశాఖ నగరం సత్తా చాటింది. 'లివింగ్ అండ్ ఆక్ససబిల్ లైఫ్' అనే విభాగంలో తుది జాబితాకు ఎంపికైన మూడు నగరాల్లో ఒకటిగా ఉక్కు నగరం నిలిచింది. బ్రెజిల్ దేశం ఈ అవార్డును దక్కించుకున్నప్పటికీ ప్రతిష్ఠాత్మక పోటీలో తుది వరకు నిలవడం పట్ల జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన హర్షం వ్యక్తం చేశారు.

స్మార్ట్ సిటీ మిషన్​లో భాగంగా విశాఖలో దివ్యాంగులైన చిన్నారుల కోసం నిర్మించిన 'ఆల్ ఎబిలిటీస్' పార్కును ఈ కేటగిరీలో పోటీకి నిలిపారు. 46 దేశాల సరసన జరిగిన పోటీల్లో భారత్ నుంచి చివరి వరకు నిలిచిన నగరంగా విశాఖ ఘనత సాధించింది. ఈ స్ఫూర్తితో వచ్చే ఏడాది విభిన్న కేటగిరీల్లో పోటీ చేసి విశాఖ ఖ్యాతిని మరింత పెంచుతామని కమిషనర్ ధీమా వ్యక్తం చేశారు

ఇదీ చదవండి:

'తొందరేమి లేదు.. నచ్చితే ఏదైనా చేస్తాం'

Last Updated : Nov 19, 2020, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.