ఎంపీ విజయసాయి రెడ్డి తనపై చేసిన విమర్శలకు.. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఘాటుగా స్పందించారు. జిల్లా పరిషత్ స్థలం ఆక్రమించుకొని గోపాలపట్నంలోని నరసింహ థియేటర్ నిర్మించారని.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి ఆరోపించారు. 1950లో ఎస్వీఎల్ఎన్ టూరింగ్ టాకీస్‌ను తమ పూర్వీకులు నిర్మించారని.. దాన్నే ఇప్పుడు నరసింహ థియేటర్‌గా అన్ని అనుమతులతో తాము నడుపుతున్నామని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.
ఎన్నికల ముందు తనపై తప్పుడు ఆరోపణలు చేసినా.. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గణబాబు తెలిపారు. నియోజకవర్గ ఓటర్లకు తన గురించి తెలుసని.. ఎవరు ఎటువంటి వారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ఏడీ పైవంతెన, పేదలకు ఇళ్ల నిర్మాణాలు తన హయాంలోనే జరగ్గా.. ఇప్పుడు వాటిని పూర్తిచేసి మేము చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
ఇదీ చదవండి: