ETV Bharat / city

'రాజధానికి విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం' - మూడు రాజధానులు

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉత్తరాంధ్ర వేదిక సమర్థించింది. పరిపాలనా రాజధానిగా ఎదిగేందుకు విశాఖలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు.

'Visakha is the most favorable place for the capital'
ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్
author img

By

Published : Dec 25, 2019, 5:52 PM IST

'రాజధానికి విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం'

రాష్ట్ర రాజధానికి విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ అన్నారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. విమాన, రైల్వే, సముద్ర, జాతీయ రహదారి అనుసంధానం కలిగిన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సత్వరం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కొద్ది సంవత్సరాల్లోనే పరిపాలనా రాజధానిగా ఎదిగేందుకు విశాఖకు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందడానికి 50 ఏళ్లు పట్టే అవకాశం ఉందని...అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చేస్తే సత్వర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_25_visakhapatnam_gateway_for_south_east_asia_ab_AP10148

( ) ఆగ్నేయ ఆసియా ముఖద్వారమైన విశాఖ నగరం సత్వర అభివృద్ధికి సూచిక అని, రాష్ట్ర పరిపాలన రాజధానికి మౌలిక వసతులు కలిగిన పట్టణమని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక స్పష్టం చేసింది. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్. శివశంకర్ మీడియా సమావేశంలో ప్రసంగించారు.

Body:గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి ఐదు సంవత్సరాలు దాటినా అభివృద్ధి చెందలేదని, విమాన, రైల్వే, సముద్ర,జాతీయ రహదారి అనుసంధానం కలిగిన విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిగాచేస్తే, రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధి సత్వరం జరుగుతుందన్నారు. కొద్ది సంవత్సరాల్లోనే పరిపాలనా రాజధానిగా ఎదిగేందుకు విశాఖకు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని స్పష్టం చేశారు.

Conclusion:ఆస్ట్రేలియా రాజధాని కేన్బెరా, బ్రెజిల్ రాజధాని బ్రెజీలియా, నైజీరియా రాజధాని అబూజా, వంటి నగరాలు రాజధానులుగా అభివృద్ధి చెందడానికి 50 సంవత్సరాలు పట్టిందని, దేశంలోని న్యూఢిల్లీ, చండీగఢ్, భువనేశ్వరి వంటి నగరాలు రాజధానిగా అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడం రాష్ట్ర సమగ్రాభివృద్ధి దోహదం చేస్తుందని శివశంకర్ స్పష్టం చేశారు.

బైట్:ఎస్.ఎస్.శివశంకర్, అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.