విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో కరోనా ఆందోళన నెలకొంది. గత వారం రోజుల వ్యవధిలో ఆసుపత్రి సిబ్బందిలో ఏడు గురు కొవిడ్ బారినపడ్డారు. సోమవారం మరో ఇద్దరు నర్సింగ్ స్టాఫ్‌కు కరోనా సోకింది. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించాలని సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈఎన్టీ ఆసుపత్రి నుంచి ప్రతి రోజు 8 అంబులెన్సులు కంటైన్మెంట్ జోన్లకు వెళ్తున్నాయి. సుమారు 50 మంది సిబ్బంది ఒక్కో కంటైన్మెంట్ జోన్ నుంచి వందకు పైగా శాంపిల్స్‌ను తీసుకువస్తున్నారు.
మరోవైపు ఆసుపత్రిలో రోజుకు 70 నుంచి 80 వరకు శాంపిల్స్ తీసుకుంటున్నారు. హై రిస్కులో పనిచేస్తున్న తమకు కనీస విశ్రాంతి లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ కేసుల బారిన పడిన వారిలో అంబులెన్స్ డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. సూపరింటెండెంట్ వెంటనే నిర్ణయం తీసుకుని లక్షణాలు ఉన్న సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు