ETV Bharat / city

డా.సుధాకర్ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తాం: ఆర్కే మీనా

వైద్యుడు సుధాకర్ స్థానిక పోలీసు స్టేషన్​కు రావటంపై విశాఖ సీపీ ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు. సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించామన్నారు. కేసుతో పోలీసులకు ఎటువంటి సంబంధంలేదన్నారు. విచారణ మొత్తం సీబీఐ చేస్తుందని చెప్పారు. కొందరు రాజకీయ నేతలతో కలిసి డా.సుధాకర్ పోలీసు స్టేషన్​ రావటంపై ఆర్కే మీనా అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తామని స్పష్టం చేశారు.

విశాఖ సీపీ ఆర్కే మీనా
విశాఖ సీపీ ఆర్కే మీనా
author img

By

Published : Jun 11, 2020, 4:41 PM IST

హైకోర్టు ఆదేశాలతో వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించామని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సీబీఐకి అందించామని తెలిపారు. డాక్టర్​ సుధాకర్​ కేసులో పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టడంలేదని స్పష్టం చేశారు. అయినా డా.సుధాకర్​ స్థానిక పోలీసు స్టేషన్​కి రావటంపై ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సీబీఐకి లేఖ రాస్తామని మీనా చెప్పారు. కేసు సీబీఐ పరిధిలో ఉండగా ఎటువంటి సామన్లు ఇవ్వలేమన్నారు. రాజకీయ నేతల ప్రోద్బలంతో పోలీసు స్టేషన్​కి వచ్చి, స్టేషన్​ ముందు ప్రసార మాధ్యమాలతో మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : విజయసాయి రెడ్డి ట్వీట్​కు రామ్మోహన్ ఘాటు కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.