పరాయి మహిళలను అభ్యంతరకరంగా చూసే వ్యక్తులకు.. కఠిన శిక్షలు వేసే చట్టాలు రూపొందించి, అమలు జరిపితేనే ఆకృత్యాలు తగ్గుతాయని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నారాయణ రావు పేర్కొన్నారు. సినిమాలు, టీవీలలోనూ మహిళలను గౌరవించే ప్రసారాలు చేయాలని విశాఖ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. కేంద్రం రూపొందించిన నిర్భయ,.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాలు.. ఆడపిల్లలను ఏ మాత్రం ఆదుకోలేకపోతున్నాయని పార్టీ మహిళా విభాగం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను కాపాడే న్యాయవాదులు ఉన్నంతవరకు నిందితులు భయపడరని అభిప్రాయపడ్డారు.
చిన్నతనం నుంచి మహిళలను చెల్లిగా, అక్కగా చూసేవిధంగా తల్లిదండ్రుల పెంపకం ఉండాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లోనూ ఆడవారి పట్ల మర్యాదతో మెలిగేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులపైనా ఉందని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: