పరిశ్రమల్లో మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ పరిశ్రమల యాజమాన్యాలను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ఆయిల్, పెట్రో కెమికల్స్, కెమికల్స్ వంటి ప్రమాదకర పరిశ్రమల నిర్వహణ, భదతా ప్రమాణాల, కోవిడ్ - 19 నివారణ చర్యలపై ఆయన.. పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షించారు. ఈ సమావేశానికి జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, పరిశ్రమల జిల్లా అధికారి ప్రసాద్, కాలుష్య నియంత్రణ అధికారి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిశ్రమల వద్ద థర్మల్ స్కానర్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని.. సిబ్బంది అంతా మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కంపెనీల యాజమాన్యాలు పరిశ్రమల్లో ఉపయోగించే రసాయనాలు, పెట్రో కెమికల్ ఉత్పత్తులు, ముడి పదార్థాలు, వాటి స్టోరేజి, రవాణాలో తగిన జాగ్రత్తలు తప్పనిసరని కలెక్టర్ సూచించారు. సాంకేతిక, నైపుణ్యత కలిగిన సిబ్బంది పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరంతర పర్యవేక్షణకు అవగాహన కలిగిన ఓ సీనియర్ అధికారిని నియమించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య శాఖ, తదితర శాఖల నుంచి ఎలాంటి సహకారం అవసరమో స్పష్టంగా తెలియజేయాలన్నారు.
ఇదీ చూడండి..: సీమెన్ ఉద్యోగాలు అన్నాడు... లక్షలు కాజేశాడు