మైదాన ప్రాంతాల్లో ఉండే తాటి చెట్ల మాదిరిగానే.. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జీలుగు కల్లు చెట్లు అక్కడక్కడా దర్శనమిస్తుంటాయి. ఏడాదిలో ఆరు నెలల పాటు జీలుగు చెట్లు కల్లుని ఇస్తాయి. ఏజెన్సీ వాసులు అమితంగా ఇష్టపడి ఈ పానీయాన్ని తాగుతుంటారు. ఏడాదిలో ఒక్కో చెట్టుకి సుమారు రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. ఇంతటి విలువైన చెట్లను, వాటి కల్లును కాపాడుకోవడానికి గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.
కొన్ని గ్రామాల్లో అయితే.. చెట్లకు తాళాలు సైతం వేస్తున్నారు. డుంబ్రిగూడ మండలం శివారు పాములుపుట్టు గ్రామంలో సరాసరి ఈ చెట్లకే యజమానులు సెంట్రీ ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు.. ఇంట్లో వారు అక్కడ గస్తీ కాస్తూనే ఉంటారు. అలాగే పెదబయలు మండలం పెదకోడాపల్లిలో చెట్టు ఎక్కకుండా కంచె వేసి తాళాలు వేశారు. జీలుగు కల్లును దొంగల పాలు కాకుండా కాపాడుకుంటున్నారు.
ఇదీ చదవండి: