14 నెలలుగా మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టామని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ చేస్తున్న పనులను చూసి వైకాపాకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. పేదవాడిని ఆదుకునేది వైకాపా ప్రభుత్వమేనని వివరించారు. 14 నెలల్లో అత్యధిక సొమ్మును సంక్షేమ పథకాల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలని, ఆ బాధ్యత తెలుగుదేశంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి పని లేకుండా వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని చెప్పారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్