ETV Bharat / city

లంబసింగిలో పర్యటకుల రద్దీ.. మంచుతో రాకపోకలకు ఇబ్బంది

రాష్ట్రంలోని తూర్పు మాన్యం ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అక్కడి అందాలను వీక్షించేందుకు బారులు తీరారు. క్రిస్మస్ మొదలుకొని సెలవు రోజులు ఉండడంతో ముందుగానే అక్కడికి చేరుకున్నారు. దట్టమైన మంచు కారణంగా లంబసింగిలో.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగింది.

traffic problems in lambasingi
లంబసింగిలో ట్రాఫిక్​కు అంతరాయం
author img

By

Published : Dec 26, 2020, 3:36 PM IST

రాష్ట్రంలోని తూర్పు మన్యం ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటకుల తాకిడి సైతం ఆయా ప్రాంతాలకు పెరుగుతోంది. ప్రధానంగా.. లంబసింగిలో పర్యటకుల సందడి ఎక్కువగా ఉంది. దట్టమైన మంచు కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.

ఆంధ్రా కాశ్మీర్​కు పెరిగిన పర్యాటకుల తాకిడి..

ఆంధ్రా కాశ్మీర్​గా పేరుపొందిన ప్రముఖ పర్యాటక కేంద్రం విశాఖ మన్యం పరిధిలోని లంబసింగికి పర్యటకుల వాహనాలు అధిక సంఖ్యలో చేరుకుంటున్నాయి. వారం రోజులుగా లంబసింగి ప్రాంతంలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు అందాలు చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనెల 25 క్రిస్మస్ నుంచి 27 వరకు సెలవు రోజులు కావడంతో సందర్శకుల తాకిడి మరింతగా పెరిగింది. విశాఖ, అనకాపల్లి, ఉభయగోదావరి, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన పర్యటకులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే లంబసింగికి చేరుకున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోపక్క విపరీతమైన చలి ఉండడంతో వాహనాల్లో నుంచి బయటకు రావడానికి పర్యటకులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కారణంగా.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి చింతపల్లి, సీలేరు, గూడెంకొత్తవీధి తదితర ప్రాంతాలకు రోజూ తెల్లవారుజామున సరఫరా చేసే నిత్యవసర సరుకుల వాహనాలు నిలిచిపోతున్నాయి. వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మన్యం @ 12 డిగ్రీల ఉష్ణోగ్రత..

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం మండలంలో చలితో గిరిజనులు వణుకుతున్నారు. శనివారం తెల్లవారుజామున తూర్పు గోదావరి జిల్లా మన్యంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంపచోడవరం, మారేడుమిల్లి, వైరామవరం మండలాల్లో చలి విపరీతంగా పెరిగింది.

ఇదీ చదవండి:

వంజంగి కొండల అందం ... ప్రకృతి రమణీయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.