విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి సందర్శకులు పోటెత్తారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో జలాశయం ప్రధాన గట్టు జనాలతో కిక్కిరిసిపోయింది.
జలాశయం అందాలను తిలకించిన పర్యాటకులు ఆనందంతో సందడిచేశారు. పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావటంతో దేవరాపల్లి నుంచి రైవాడ జలాశయానికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి : 'వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం చేయండి'