నేడు విశాఖ శారదా పీఠాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. రెండు గంటలపాటు శారదా పీఠంలోనే గడపనున్నారు. అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు శారదా పీఠం చేరుకోనున్న సీఎం... రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు. తితిదే చేపట్టిన విశ్వశాంతి హోమం, చతుర్వేద హవనం వద్ద పూజలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం జగన్‌కు శారదా పీఠం అందజేయనుంది. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం చేతుల మీదుగా స్వర్ణకంకణ ధారణ కార్యక్రమం జరుగుతుంది. శారదాపీఠం వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, భాజపా నేత సుబ్రమణ్యస్వామితోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి : 'పింఛన్ల తొలగింపుపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారాలు'