రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విశాఖలో ఆరోపించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వం ఎల్లవేళలా అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.
ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులకు స్వస్తి పలికి ప్రజా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: పింఛన్ డబ్బులు అపహరించి.. జూదం ఆడి..!