ETV Bharat / city

Tirumlala tour with Tribes : గిరిజనులతో తిరుమల యాత్ర.. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి - Ranajalleda visit by Swathmanandendra Saraswathi

Tirumlala tour with Tribes : రవాణా సౌకర్యం లేక వేంకటేశుని దర్శన భాగ్యానికి నోచుకోని అరకు, పాడేరు ప్రాంత ఆదివాసీలను 2022 సంవత్సరంలో తిరుమల యాత్రకు తీసుకెళతామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రకటించారు.

Ranajalleda visit by Swathmanandendra Saraswathi
రణజల్లెడ గ్రామాన్నిసందర్శించిన స్వామీజీ
author img

By

Published : Dec 29, 2021, 8:30 PM IST

Tirumlala tour with Tribes : రవాణా సౌకర్యం లేక వేంకటేశుని దర్శన భాగ్యానికి నోచుకోని అరకు, పాడేరు ప్రాంత ఆదివాసీలను.. 2022 సంవత్సరంలో తిరుమల యాత్రకు తీసుకెళతామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ప్రకటించారు. హిందూ ధర్మం పట్ల గిరిజనులు ప్రదర్శిస్తున్న గౌరవం చూస్తుంటే సంతోషం కలుగుతోందని ఆయన అన్నారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకున్న వారిలో.. గిరిజనులు ముందుంటారని చెప్పారు.

విశాఖ ఏజెన్సీలోని అరకు సమీప రణజల్లెడ గ్రామాన్ని స్వామీజీ సందర్శించారు. విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన గిరిజన ధార్మిక సేవ కార్యక్రమంలో భాగంగా రణజల్లెడ వెళ్ళారు. చలితో ఇబ్బందులు పడుతున్న గిరిజన వృద్ధులు, పిల్లలకు రగ్గులు పంపిణీ చేశారు. అన్యమతాల ప్రలోభాలకు లోనుకాకుండా హిందూత్వాన్ని రక్షించే ఉద్యమ కర్తలుగా గిరిజనులు ఉండాలని సూచించారు. గిరిజనులను ధర్మపథం వైపు నడిపించే విషయంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. గిరిజన గోవిందం, దళిత గోవిందం తరహా కార్యక్రమాలను క్రమం తప్పకుండా విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతోందని తెలిపారు.

స్వామీజీకి రణజల్లెడ గ్రామస్తులు గిరిజన సంప్రదాయం ప్రకారం థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఓ బాలిక స్వామీజీ దృష్టికి తీసుకురాగా.. శారదాపీఠం తరఫున నిర్మాణం చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. స్వామీజీ తమ గ్రామాన్ని సందర్శించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : Rally against police actions : "పోలీసులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.