పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలతో పాటు... ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాపై ఇది కేంద్రీకృతమైందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోందని... అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని... విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మత్స్యకారులను హెచ్చరించింది.
ఇదీచదవండి