ETV Bharat / city

విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరి.. 13 తులాల బంగారం, నగదు అపహరణ - today chori case in visakhapatnam district news

విశాఖలోని ఫుడ్ కార్పొరేషన్ విశ్రాంత ఉద్యోగి బండారు మహేశ్వరరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో వారంతా తిరుపతి వెళ్లిన సమయంలో సంఘటన చోటు చేసుకుంది. దుండగులు 13 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు.

thieves stolen
విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరి
author img

By

Published : Apr 3, 2021, 12:58 PM IST

విశాఖపట్నంలోని కశింకోట అగ్రహారం వీధి సాయి నగర్ లోని ఇంట్లో భారీ చోరీ జరిగింది. కశింకోట ఎస్సై సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం విశ్రాంత ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగి బండారు మహేశ్వరరావు, ఇతని భార్య జయలలిత కుటుంబ సభ్యులతో వారం రోజుల క్రితం తిరుపతి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు తాళం పగులగొట్టి ఉంది.

లోనికి ప్రవేశించి, చూడగా.. బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలోని 13 తులాల బంగారు వస్తువులు, 3 లక్షల రూపాయల నగదు అపహరించినట్లు బాధితుడు మహేశ్వరరావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కశింకోట ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి:

రికార్డు స్థాయిలో సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.