విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి 31 వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలిచ్చామని విద్యాశాఖ జిల్లా అధికారి లింగేశ్వర రెడ్డి చెప్పారు. ప్రతి మండలానికి రూ. 7244 ల చొప్పున నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు.
ఈ నెల 22న వేపగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వ్యాసరచన, గణిత నమూనాల పోటీలు నిర్వహిస్తామన్నారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జీవిత చరిత్ర పై నిర్వహించే వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. ఈ నెల 30న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఈవో వివరించారు.
ఇదీ చదవండి: