TDP Dharna on OTS : విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా ధర్నా నిర్వహించింది. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పట్టాలకు లాకింగ్ పీరియడ్ అయిపోయినా.. అధికారులు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓటీఎస్‌పై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింహాచలం దేవస్థానం ఇళ్లను రెగ్యులైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : Sapota farmers struggle : చితికిపోతున్న సపోటా రైతులు..!