Banned drug injections: విశాఖలో నిషేధిత మత్తును కలిగించే ఇంజక్షన్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలతో... ఎస్‌బి ఏడీసీపీ ఆనందరెడ్డి పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు నేతృత్వంలో సిబ్బంది నిఘా పెట్టారు. వెంకోజీపాలెం వద్ద ఓ ఆసుపత్రికి సమీపంలో కొంతమంది యువకులు ఇంజక్షన్లను కలిగి ఉన్నారని, యువతకు వీరు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో శనివారం దాడులు జరిపారు. భీమిలికి చెందిన పి.శ్రీను (39), అల్లిపురానికి చెందిన పి.రవికుమార్(26)లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి, తనిఖీలు జరిపారు. ఆ సమయంలో వారి వద్ద నిషేధిత 270 ఇంజక్షన్లు, రూ.1600 నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి వివరాలు సేకరించగా, 50 ఇంజక్షన్లను కలిగిన బాక్సును రూ.6వేలకు కొనుగోలు చేసి, ఒక్కో ఇంజక్షన్‌ను బయట రూ.300కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్సు రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ ఇంజక్షన్‌ను శస్త్రచికిత్స అనంతరం పెయిన్ కిల్లర్‌గా ఉపయోగిస్తారని, వీటిని కేవలం ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో మాత్రమే విక్రయించాల్సి ఉందని ఏసీపీ త్రినాథరావు తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా
Injections: విశాఖలో నిషేధిత మత్తు ఇంజక్షన్లు సీజ్... ఇద్దరు అరెస్ట్ - విశాఖ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Banned drug injections: విశాఖలో నిషేధిత మత్తును కలిగించే ఇంజక్షన్లు కలకలం సృష్టించాయి. వెంకోజీపాలెం వద్ద కొంతమంది యువకులు ఇంజక్షన్లను యువతకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిషేధిత మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
Banned drug injections: విశాఖలో నిషేధిత మత్తును కలిగించే ఇంజక్షన్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలతో... ఎస్‌బి ఏడీసీపీ ఆనందరెడ్డి పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాథరావు నేతృత్వంలో సిబ్బంది నిఘా పెట్టారు. వెంకోజీపాలెం వద్ద ఓ ఆసుపత్రికి సమీపంలో కొంతమంది యువకులు ఇంజక్షన్లను కలిగి ఉన్నారని, యువతకు వీరు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో శనివారం దాడులు జరిపారు. భీమిలికి చెందిన పి.శ్రీను (39), అల్లిపురానికి చెందిన పి.రవికుమార్(26)లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి, తనిఖీలు జరిపారు. ఆ సమయంలో వారి వద్ద నిషేధిత 270 ఇంజక్షన్లు, రూ.1600 నగదు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి వివరాలు సేకరించగా, 50 ఇంజక్షన్లను కలిగిన బాక్సును రూ.6వేలకు కొనుగోలు చేసి, ఒక్కో ఇంజక్షన్‌ను బయట రూ.300కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో బాక్సు రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ ఇంజక్షన్‌ను శస్త్రచికిత్స అనంతరం పెయిన్ కిల్లర్‌గా ఉపయోగిస్తారని, వీటిని కేవలం ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో మాత్రమే విక్రయించాల్సి ఉందని ఏసీపీ త్రినాథరావు తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా
TAGGED:
visakha latest updates