ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: థియేటర్ల మూతతో సిబ్బందికి దూరమైన ఉపాధి - తెలుగు సినీ పరిశ్రమ పై కరోనా ప్రభావం

పని ఉంటే మస్త్‌రా మామా.. లేదంటే.. పస్తులు మామా... అన్నారో సినీ కవి. సినిమాలే లైఫ్‌ రా మామా...లైఫంతా సినిమా మామా.. అంటూ రాసిన ఈ గీతం.. సినీరంగ కార్మికుల కష్టాల్నే కాదు థియేటర్‌పై ఆధారపడిన సిబ్బంది జీవితాలకు అద్దం పడుతోంది. కరోనా మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్ తప్పనిసరి కావటంతో చిత్రపరిశ్రమకు ఎక్కడలేని చిక్కులు వచ్చిపడ్డాయి. థియేటర్ల మూసివేతతో వాటినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న చిరుద్యోగులు, కార్మికులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ థియేటర్ సిబ్బంది రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌నూ ఇబ్బందుల్లో పడేసింది.

Staff employment with the lid of movie theaters
థియేటర్ల మూతతో సిబ్బందికి దూరమైన ఉపాధి
author img

By

Published : Jul 4, 2020, 10:57 PM IST

థియేటర్ల మూతతో సిబ్బందికి దూరమైన ఉపాధి

ఒకప్పటిలా సమోసాల ఘుమఘుమలు లేవు. గేటు బయట బ్లాక్ టికెట్ల గుసగుసలు లేవు. టికెట్ల కోసం మినీ యుద్ధాలు...తొక్కిసలాటలు మాయమైపోయాయి. 60అడుగుల ఆజానుబాహుడిలా రొమ్ము విరుచుకుని నిలబడే హీరోలా కటౌట్లు కనుమరుగైపోయాయి. వీరాభిమానులు నిర్వహించే క్షీరాభిషేకాలు లేవు. తెరపై బొమ్మ పడగానే....ఈలలు, చప్పట్లు, కేరింతలతో దద్దరిల్లిపోయిన థియేటర్లలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నిత్యకల్యాణం...పచ్చతోరణంలా సందడి చేసిన సినిమా థియేటర్‌లు బోసి పోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కోసం థియేటర్లపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.

సినిమా రంగం అనేది ఒక పెద్ద పరిశ్రమ. సినిమా తీసే క్రమంలో....ఎన్ని కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉపాధి పొందుతాయో..సినిమాలు ఆడే థియేటర్ల మీదా... అంతకంటే ఎక్కువ కుటుంబాలే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. థియేటర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి.... సినిమా చూసి తిరిగి ఇంటికి వచ్చేంత వరకూ...ఈ రెండున్నర గంటల సమయం పై ఆధారపడి కొన్ని లక్షలాది మంది బతుకు వెళ్ళదీస్తున్నారు. పార్కింగ్ సిబ్బంది నుంచి మొదలు పెడితే...టికెట్లు ఇచ్చేవారు...హాల్ లోకి వెళ్లేందుకు తనిఖీలు చేసే భద్రతా సిబ్బంది...టికెట్‌లు చింపి లోపలికి పంపేవారు, స్క్రీన్ ఆపరేటర్స్, సమోసా, పాప్ కార్న్, కూల్ డ్రింక్‌లు వగైరా అమ్ముకునే దుకాణదారులు, హాల్‌ను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు, గేట్ బయట కాపలా కాసే వాచ్‌మెన్లు, థియేటర్ బాగోగులు చూసుకునే మేనేజర్లు..నగదు వ్యవహారాలు చూసుకునే క్యాషియర్లు...సూపర్ వైజర్లు...ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమా హాల్ మీద ఆధారపడి కడుపు నింపుకుంటున్న కుటుంబాలు 30కి పైగానే ఉంటాయి.

మూడు నెలలుగా మూగబోయిన థియేటర్లు...

తెలుగు రాష్ట్రాల్లో సినిమారంగంపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది. వెండితెరపై బొమ్మ పడితేనే కానీ పూట గడవని కుటుంబాలు కరోనా దెబ్బతో రోడ్డున పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల పై ఆధారపడి మూడున్నర లక్షలమందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 17వందలకు పైగా థియేటర్లు ఉన్నాయి. టికెట్ల విక్రయం దగ్గర నుంచి క్యాంటీన్ నిర్వహణ, పార్కింగ్, భద్రత తదితర విభాగాల్లో ఒక్కో సినిమా హాల్‌లో 20 నుంచి 30 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు మరి కొంత మంది తాత్కాలిక సిబ్బంది పనిచేస్తుంటారు. థియేటర్లు మూసివేయడంతో అందులో పనిచేసే ఉద్యోగులు మూడు నెలలుగా ఉపాధి కోల్పోయారు.

రోజు నాలుగు ఆటలు ప్రదర్శించే థియేటర్‌లో సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేస్తుంటారు. సినిమా సూపర్‌హిటై... థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయి..కోట్లాది రూపాయల కలెక్షన్‌లు వచ్చినా...వీళ్లకు సినిమా కష్టాలు తప్పవు. ఎందుకంటే థియేటర్ సిబ్బంది జీతాలు చాలా తక్కువ. 15వేల రూపాయల లోపు జీతగాళ్లే ఎక్కువ. అలాంటి వీరి జీవితాలు ఈ కరోనా దెబ్బకు మరింత దిగజారాయి. సినిమా ధియేటర్లు మూసివేయడంతో.....వీరంతా జీతాల్లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులిచ్చే వారు.. ఆదుకునే వారు లేక అవస్థలు పడుతున్నారు.

బొమ్మపడక బోసిపోయిన మల్టీఫ్లెక్స్​లు...

సినిమాల ప్రదర్శన నిలిపివేయటంతో ఒక్కో థియేటర్‌కు నష్టం లక్షల్లో వాటిల్లుతోంది. యజమానులు, లీజుదారులకు ఖాళీ థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. సాధారణ రోజుల్లో ఒక్కో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో నెలవారి ఖర్చు లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అదే మల్టిఫ్లెక్స్‌ల్లో 5 నుంచి10 లక్షల దాటుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెండితెర మీద బొమ్మ పడకపోవడంతో ఆదాయం లేదు. నిర్వహణ ఖర్చు మాత్రం తప్పడం లేదు. థియేటర్ల మూసివేత తో ఒక్క సిబ్బందే కాదు దానిపై ఆధార పడే వివిధ చిరు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. థియేటర్ సమీపంలో ఉండే ఈ షాపులకు సినిమాకు వచ్చే ప్రేక్షకులే వినియోగదారులు. వంద రోజులకు పైగా థియేటర్లు మూత పడటంతో సమీపంలో ఉండే చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

థియేటర్‌లో తెరపై బొమ్మ పడి...బాగా ఆడితినే యాజమాన్యం...థియేటర్ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటిది లాక్‌డౌన్ వల్ల100 రోజులుగా థియేటర్‌కు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఎటు చూసిన చిరిగిన వాల్ పోస్టర్లు, దుమ్మూ ధూళితో నిండిపోయిన థియేటర్ ఆవరణలే దర్శమిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చి మహమ్మారి బెడద పూర్తిగా తొలిగే వరకు సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం ఉండదని సినీరంగానికి చెందిన నిపుణుల అభిప్రాయం.దీంతో థియేటర్లలో పనిచేసే సిబ్బంది పరిస్ధితి పూర్తిగా ఆగమ్యగోచరంగా తయారైంది. ఇన్నాళ్లు చేసిన ఈ పనిని పూర్తిగా వదలిపెట్టలేరు. కరోనా వల్ల వేరే ఉపాధి లభించే పరిస్థితి లేదు. ఈ ఆపద కాలంలో ఎటు పోవా..లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్ధితిలో సినీ కార్మికులు నిజంగానే సినిమా కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. త్వరగా ఈ కరోనా కష్టం నుంచి గట్టెక్కాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇవీ చదవండి: 'సప్త' స్వరాల సంగమం... ఆమె గానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.