ETV Bharat / city

రుషికొండలో కొలువుతీరనున్న తిరుమల రాయుడు.. - రుషికొండలో శ్రీవారి ఆలయం

Srivari Temple in RushiKonda : విశాఖ రుషికొండలో ఏడుకొండలవాడు కొలువుతీరనున్నాడు. రుషికొండ తీరాన తితిదే నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 23న శ్రీవారి మూర్తిని ఇతర పరివార దేవతలను వేద ప్రొక్తంగా ప్రతిష్ట చేయనున్నారు.

Srivari Temple in Rushikonda
Srivari Temple in Rushikonda
author img

By

Published : Mar 20, 2022, 5:41 PM IST

TTD Built Srivari Temple in RushiKonda : విశాఖ రుషికొండలో ఏడుకొండలవాడు కొలువుతీరనున్నాడు. రుషికొండ తీరాన సముద్ర మట్టానికి 145 అడుగుల ఎత్తున.. పదెకరాల విస్తీర్ణంలో.. రూ.30 కోట్లతో తితిదే ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ మహాసంప్రోక్షణ పూజాది కార్యక్రమాలు ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రుత్వికులు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముఖ్య ఆచార్యులు సమక్షంలో ఆరు రోజులపాటు శ్రీవారి దేవతామూర్తుల ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి.

రుషికొండలో కొలువుతీరనున్న తిరుమల రాయుడు..

ఈ నెల 23న శ్రీవారి మూర్తిని ఇతర పరివార దేవతలు వేద ప్రొక్తంగా ప్రతిష్ట చేయనున్నారు. ఈనెల 23న జరగనున్న ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తితిదే ఇప్పటికే ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత సర్వ దర్శనం కల్పించనున్నారు. ఆలయాన్ని సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఏర్పాట్లను, పరిసరాలను పరిశీలించారు. ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ కాంతులతో శోభిల్లుతున్న ఆలయం భక్తులను పరవశింపజేస్తోంది.

ఇదీ చదవండి : Goshala's: పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాలుగా గోశాలలు: తితిదే ఈవో జవహర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.