ఇదీ చదవండీ... కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!
'మారాలి... మారాలి... మనమంతా మారాలి'
మారాలి... మారాలి... మనమంతా మారాలి అంటూ... సినీ రంగానికి చెందిన సాంకేతిక విభాగం యువత గళమెత్తింది. సినీ పరిశ్రమలో ఆన్లైన్ ఎడిటర్‌గా పని చేస్తున్న ప్రదీప్‌కుమార్... కరోనా కట్టడి దిశగా ప్రజల్లో భౌతికదూరంపై అవగాహన కల్పించాలని భావించారు. పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషిని గౌరవించడమంటే మనం బాధ్యతగా ఉండడమని సహచరులతో కలిసి గళమెత్తారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బృందంలో సహాయకుడిగా పనిచేస్తున్న వికాస్... మారాలి మారాలి పాటకు సంగీతాన్ని అందించారు. శ్రీసిరాగ్ పాటను రచించగా... మస్తాన్ వలి, కార్తీక్ సాంకేతిక సహకారాన్ని అందించారు. కరోనా కట్టడి దిశగా కృషి చేస్తున్న సిబ్బందికి ఈ పాటను అంకితం చేస్తున్నట్లు వారు చెప్పారు.
మారాలి... మారాలి... మనమంతా మారాలి
ఇదీ చదవండీ... కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!