ETV Bharat / city

'ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కమిషనర్​కు​ దస్త్రం'

సింహాద్రి అప్పన్న సన్నిధిలో పారాయణం చేసే అర్చకుల్లో 9 మందిని విధుల నుంచి తొలగించారని వస్తున్న వార్తలపై ఈవో భ్రమరాంబ వివరణ ఇచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్​ అనుమతి లేని వారు స్వామి వారి పారాయణంలో పాల్గొంటున్నారని... వారిని కొనసాగించాలా..? లేక తొలగించాలా అనే ఉద్దేశంతో ఉన్నతాధికారికి దస్త్రం రాశామని తెలిపారు.

simhachalam eo gives clarity on priests removal viral issue in social media
సింహాచలం ఈవో భ్రమరాంబ వివరణ
author img

By

Published : Aug 25, 2020, 8:23 AM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో పారాయణం చేసే అర్చకుల్లో 9 మందిని విధుల నుంచి తొలగించినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ఈవో భ్రమరాంబ వివరణ ఇచ్చారు. స్వామివారికి ప్రతి రోజూ పారాయణం చేసే అర్చక స్వాముల్లో 14 మందికి కమిషనర్​ అనుమతి లేదని... వీరిని కొనసాగించాలా..? లేక తొలగించాలా..? అనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ కమిషనర్​కు దస్త్రం రాశామని పేర్కొన్నారు. ఆయన అనుమతి వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని... ప్రస్తుతానికి విధుల నుంచి ఎవ్వరినీ తొలగించలేదని తెలిపారు. ఆర్జిత సేవలు తగ్గడంతో స్వామి వారికి వచ్చే ఆదాయం తగ్గిందని... అందుచేత ఆర్థిక భారం తగ్గించుకునే భాగంలోనే కమిషనర్​కు దస్త్రం రాశామని తెలిపారు.

ఇదీ చదవండి :

దేవస్థానంలో వేలం నిర్వహణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.