విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఇకపై ఏడువారాల నగలతో అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మహామండపం ఏడో అంతస్తులోని వీఐపీ లాంజ్‌లో అమ్మవారి ఏడువారాల నగలను ప్రదర్శినకు ఉంచారు. సోమవారం ముత్యాలు, మంగళవారం పగడాలు, బుధవారం పచ్చలు, గురువారం పుష్య రాగాలు, శుక్రవారం వజ్రాలు, శనివారం నీలాలు, ఆదివారం కెంపులతో అలంకరణ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ నెల 12న అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఉత్తరానక్షత్రం సందర్భంగా... ఆ రోజు నుంచి అమ్మవారికి ఏడువారాల నగల అలంకరించనున్నట్లు చెప్పారు.
ఇదీచదవండి