'ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి.. వికేంద్రీకరణతోనే సాధ్యం' అనే అంశంపై విశాఖ ఏయూ స్థాతకోత్సవం హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. విశాఖ కార్య నిర్వాహక రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని సదస్సు అభిప్రాయ పడింది.
విశాఖ నగరంలో అన్ని వసతులు ఉన్నాయని.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి అవుతున్న నగరమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
దేశంలో ప్రముఖ నగరంగా విశాఖ ఎదుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం సీఆర్డీఏను కాపిటల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసిందని విమర్శించారు. ఇప్పటికీ అక్కడ సరైన సౌకర్యాలు లేని పరిస్థితులు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: