Viskha steel plant విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెంలో ఉక్కు కర్మాగార ప్రధాన ద్వారం వద్ద కార్మికులు, నిర్వాసితులు సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. 36 గంటల పాటు చేపట్టనున్న దీక్ష సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేతలు, ఉద్యోగులు ఈ దీక్ష చేపట్టారు. పంద్రాగస్టు సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ వినాలని కోరుతున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: