ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు ఈ రోజు విశాఖలో పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెల 2న మొదటి విడత నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ఎక్కువ మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోలేని వారి కోసం నేడు రెండో దశ పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు.
ఇవి చూడండి...