ETV Bharat / city

100 Times Blood Donation: యువతకు ఆదర్శం విశ్రాంత ఉపాధ్యాయుడు రమణమూర్తి - వందోసారి రక్తదానం చేసిన రమణమూర్తిపై ప్రత్యేక కథనం

100 times Blood Donor: ఆపద సమయంలో ఎవరికైనా రక్తం కావాలంటే అందరికంటే ముందుంటారు. ఆరు పదుల వయసులోనూ ఆలోచించకుండా ప్రాణం నిలిపేందుకు సిద్ధమవుతారు. వందోసారి రక్తదానం చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు విశాఖ నగరానికి చెందిన రమణమూర్తి.

100 Times Blood Donor Ramanamurthy
వందోసారి రక్తదానం చేసిన రమణమూర్తి
author img

By

Published : Dec 21, 2021, 9:47 AM IST

వందోసారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న విశ్రాంత ఉద్యోగి రమణమూర్తి

Retired Teacher Ramanamurthy Donated Blood 100 times at visakhapatnam: విశాఖకు చెందిన డాక్టర్ పిళ్లా రమణమూర్తి.. సంస్కృత అధ్యాపకునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. విద్యాదానంతో పాటు రక్తదానం అవసరాన్ని చాటుతున్నారు. వందోసారి రక్తదానం చేసిన అతికొద్ది మంది వ్యక్తుల జాబితాలో చేరారు. ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం..రక్తదానం ద్వారా ప్రతీ ఒక్కరికి ఉందనేది రమణమూర్తి గట్టి విశ్వాసం. ఆ విశ్వాసమే తనను రక్తదానానం చేయడానికి స్ఫూర్తినిస్తోందని చెబుతున్నారు. శారీరక వ్యాయామం, నియమబద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల..రక్తదానం చేయడానికి వీలవుతుందంటున్నారు.

నేటి యువతకు ఆదర్శ.. మూర్తి

100 Times Blood Donor Ramanamurthy: వందసార్లు రక్తదానం చేసి యువతరానికి రమణమూర్తి అదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు. వందోసారి రక్తదానం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించి సత్కరించారు. సామాజిక బాధ్యత వైపు యువత దృష్టి పెట్టేలా రమణమూర్తి ఆచరణాత్మకంగా అనుసరిస్తున్న విధానాన్ని అందరూ అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి..

Subbarao Gupta Attack: మంత్రి బాలినేనిని కలిసిన గుప్తా.. వివాదం సద్దుమణిగిందా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.